![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -61 లో..సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం రామలక్ష్మికి చెప్తుంది. మా పెళ్లి కోసం అన్నయ్య చాలా కష్టపడుతన్నాడు. అసలు మా పెళ్లి జరుగుతుందా అని టెన్షన్ పడుతుంటుంది. మీ అన్నయ్య కచ్చితంగా నీకు, ధనలకి పెళ్లి చేస్తాడని సిరి ధైర్యం చెప్తుంది. సీతా సర్ మా నాన్నపై కోపాన్ని పక్కన పెట్టింది ఇందుకేనా అని రామలక్ష్మి తనలో తానే అనుకుంటుంది.
ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వెళ్లి.. తన కాళ్ళని పట్టుకుంటుంది. ఏం చేస్తున్నావని సీతాకాంత్ అడుగుతాడు. మీరు చేస్తున్న పనికి కాళ్ళు పట్టుకున్నా తప్పు లేదనిపించింది అందుకే అని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడే సిరి తన ప్రెగ్నెంట్ గురించి చెప్పింది.. మీ చెల్లెలి కోసం ఎంత కోపాన్ని పక్కన పెట్టి మీరు ఎంత బాధపడుతున్నారో అర్థమైంది.. ఇన్ని రోజులు మా నాన్నపై కోపంగా ఉండేది.. ఇప్పుడు ద్వేషంగా ఉంది. ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు. ధనతో సిరి పెళ్లి అవుతుందో లేదోనని తను ఏడుస్తుందని రామలక్ష్మి అనగానే.. ఇప్పుడు సిరి ఎక్కడ ఉందన సిరి దగ్గరికి సీతాకాంత్ వెళ్తాడు. నీ పెళ్లి ధనతో ఎలాగైనా జరిపిస్తాను.. నువ్వు టెన్షన్ పడకు అని సీతాకాంత్ చెప్తాడు. నీ కడుపులో పెరుగుతుంది నాన్న అని సీతాకాంత్ అంటాడు. మీ అన్నయ్య చూసుకుంటాడు...నీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పు అని రామలక్ష్మి అనగానే.. నాకు అమ్మకి తెలియకుండా వెళ్లి ఐస్ క్రీమ్ తినాలని ఉందని సిరి చెప్పగానే.. సరే అని సీతాకాంత్ అంటాడు. వదిన ని కూడా తీసుకొని వెళదామని సిరి అనగానే.. ముగ్గురు కలిసి బయటకు వెళ్తారు.
ఆ తర్వాత ముగ్గురు ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తారు. అక్కడ రెండు ఐస్ క్రీమ్ లు ఉంటాయి. అన్నయ్య వదిన మీరు షేర్ చేసుకోండి అంటు వాళ్ళిద్దరికి కలిపి ఒక ఐస్ క్రీమ్ ఇస్తుంది సిరి. ఆ తర్వాత మాణిక్యం మాటలని శ్రీలత గుర్తుకుచేసుకుంటుంది. శ్రీవల్లి పాలు తీసుకొని వచ్చి ఇస్తుంది. అప్పుడే రామలక్ష్మి, సీతాకంత్ , సిరి ముగ్గురు వస్తారు. అమ్మ ఉంది.. మీరు వెళ్ళండి అని సిరి చెప్పగానే వాళ్ళిద్దరు లోపలికు వెళ్తారు. ఎక్కడికి వెళ్లారని శ్రీవల్లి అడుగుతుంది. ఐస్ క్రీమ్ తిని వస్తున్నామని సీతాకాంత్ చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత వాళ్ళు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని శ్రీలతకి శ్రీవల్లి చెప్తుంది. మరుసటిరోజు ఉదయం సీతాకాంత్ నిద్ర లేచి రామలక్ష్మిని చూస్తూ.. డైరీలో కవిత్వం రాస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |